విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు
– తాండూరు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు
– గురుకుల బాటలో పాఠశాలల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులను ఇబ్బందులు పెట్టి ప్రమాదంలో పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ కన్వినర్ శకుంతల దేశ్ పాండే, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు తదితరులు తాండూరులోని పలు గురుకుల పాశాలలను సందర్శించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగితెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యాలు లేకుండా, నాణ్యమైన భోజనం అందించకుండా ప్రమాదంలో పడేయొద్దన్నారు. విద్యార్థులకు గురిచేస్తే ఆందోళన తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు జోగుల ఎబినేజర్, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, నాయకులు రజక నర్సింహా, ఇంతియాజ్ బాబా, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఫోన్‌ వస్తే ఎత్తకండి..!