తెలంగాణ ధీర‌వ‌నిత చాక‌లి ఐల‌మ్మ‌

తాండూరు వికారాబాద్

తెలంగాణ ధీర‌వ‌నిత చాక‌లి ఐల‌మ్మ‌
– నివాళులు అర్పించిన సీపీఎం, ప్ర‌జా సంఘాల‌ నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ సాయుధ పోరాటంలో ర‌జాకార్లకు వ్య‌తిరేకంగా పోరాడిన చాక‌లి ఐల‌మ్మ తెలంగాణ ధీర వ‌న‌తిగా నిలిచింద‌ని సీపీఎం, ప్రజా సంఘాల నాయ‌కులు పేర్కొన్నారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని వీవీహెచ్ఎస్ స్కూల్ వ‌ద్ద‌ చాక‌లి ఐల‌మ్మ 36 వ‌ర్దంతి సంద‌ర్భంగా ర‌జ‌క సంఘాల ఆధ్వ‌ర్యంలో సీపీఎం నాయకులు శ్రీ‌నివాస్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి అబ్బని బసవయ్య, రజక సంఘం నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ కార్మిక సంఘం అధ్యక్షులు భీమప్పలు ఐల‌మ్మ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాక‌లి ఐల‌మ్మ చేసిన ఉద్య‌మాల‌ను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట మహేష్, రజక సంఘం నాయకులు, తాండూర్ గంజి మార్కెట్ కార్మిక సంఘం నాయకులు కే బాలప్ప, భద్రప్ప, వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు