మునుగోడు గెలుపులో మేముసైతం

తాండూరు రాజకీయం వికారాబాద్

మునుగోడు గెలుపులో మేముసైతం
– టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి తరుపున ప్రచారం
– ఓట‌ర్ల‌ను చైత‌న్య ప‌రుస్తున్న తాండూరు నేత‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మేముసైతం అంటూ తాండూరు నేత‌లు పాల్పంచుకుంటున్నారు. మునుగోడు టీఆర్ఎస్‌(బీఆర్ఎస్‌) పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కోసం ఇంచార్జ్ హోదాలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. తాజాగా ఆదివారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డిలు ప్రచారానికి వెళ్లారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరువున మునుగోడు నియోజకవర్గంలోని చిన్నూరు గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల వద్దకు, గడప గడప వద్దకు వెళ్లి టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ప్రభాకర్ రెడ్డికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎు స్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.