తట్టెపల్లికి కొత్త మండలం హోదా ఇవ్వండి

తాండూరు రాజకీయం వికారాబాద్

తట్టెపల్లికి కొత్త మండలం హోదా ఇవ్వండి
– మండలం ఏర్పాటుకు అన్ని అవకాశాలు
– అసెంబ్లీలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కొత్త మండలం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణించి పెద్దేముల్ మండలంలో తట్టెపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.

మరోవైపు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో తట్టెపల్లి గ్రామం మేజర్ పంచాయతీగా ఉంది. పరిసర ప్రాంతాల్లో గ్రామాలు, తాండా పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కలుపుకుని మండలంగా ఏర్పాటు చేయాలని గత కొన్నేండ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం సాధన కమిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తట్టెపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని గిరిజన తండాల యువకులు, నాయకులు పెద్ద ఎత్తున రోజువారీగా దీక్ష చేపట్టారు. తాజాగా అసెంబ్లీలో తట్టెపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..!