గులాబీ మ‌యం..!

తాండూరు వికారాబాద్

గులాబీ మ‌యం..!
– అట్ట‌హాసంగా విస్తృత‌స్థాయి స‌మావేశం
– జెండా ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– భారీగా త‌ర‌లివ‌చ్చిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ గులాబీ మ‌య‌మ‌య్యింది. బుధ‌వారం తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గ పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన‌ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మానికి వైద్య ఆరోగ్య మౌళిక వ‌స‌తుల కల్ప‌న సంస్థ చైర్మ‌న్ ప‌ర్యాద కృష్ణ‌మూర్తి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు, ఎంపీపీలు బాలేశ్వ‌ర్ గుప్త, క‌రుణ అజ‌య్ ప్ర‌సాద్, మార్కెట్ క‌మిటి చైర్ ప‌ర్స‌న్ అరుణ గోపాల్ రెడ్డి, తాండూరు మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), తాండూరు మండ‌ల అధ్య‌క్షులు రాందాస్,
పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాదవ్, తాండూరు మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, న‌ర్సిరెడ్డి, మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్నమాల‌, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జాబాల్‌రెడ్డి, మ‌హిళ నాయ‌కురాలు, కౌన్సిల‌ర్ విజ‌య‌దేవి, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ గ్రామాల స‌ర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్ష‌న్ స‌భ్యులు, ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. దీంతో జీపీఆర్ గార్డెన్ గులాబీమయంగా మారింది. వ‌చ్చే నెల వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే టీఆర్ఎస్ విజ‌య సింహాగ‌ర్జ‌న స‌భ‌కు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లిరావాల‌ని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.