సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ..!
– వైభోగంగా రేణుకా నాగ ఎల్లమ్మ జాతర
– దర్శించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి
– బోనాలతో భక్తుల నవేద్యాల సమర్పణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తులు తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మను వేడుకున్నారు. శుక్రవారం అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి బోనాల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది.
అదే విధంగా కోరిన కోర్కెలు నెరవేరాయని అమ్మవారికి కోడి పుంజులను తీసుకవచ్చి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, బీఆర్ఎస్ మహిళ నాయకురాలు శకుంతల, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు రేపు శనివారం జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటి సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, హమాలీ కార్మిక సంఘం నేతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

