బ్రేక్ తీసుకున్న క‌రోనా

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

బ్రేక్ తీసుకున్న క‌రోనా
– పెరిగిన ప‌రీక్ష‌లు, స్వ‌ప్పంగా త‌గ్గిన కేసులు
– తాండూరులో 78 మందికి పాజిటివ్ నిర్దార‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో వేగంగా దూసుకెళుతున్న క‌రోనా కేసుల‌ను స్మాల్ బ్రేక్ ప‌డింది. పైపైకి ఎగ‌బాగుతున్న కేసులు గురువారం స్వ‌ల్పంగా త‌గ్గాయి. జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఉద‌యం నుంచి నిర్వ‌హించిన క‌రోనా నిర్దార‌ణ పరీక్ష‌లో కేసులు తగ్గుముఖం ప‌ట్టాయి. మొత్తం 353 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 78 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్ట‌ర్ బాస్క‌ర్ తెలిపారు. మ‌రోవైపు తాండూరులో రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జిల్లా ఆసుప‌త్రికి ప‌రీక్ష‌ల కోసం త‌ర‌లి వ‌స్తున్నారు.

ఉద‌యం నుంచే ప‌రీక్షా నిర్దార‌ణ కేంద్రం వ‌ద్ద బారులు తీరుతున్నారు. అనుమానంతో వ‌స్తున్న ప్ర‌జ‌ల కోసం ఆసుప‌త్రి యంత్రాంగం కూడ ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచింది. యువ‌కులు, పెద్ద‌లు, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి ప‌రీక్ష‌ల‌ను చేయించుకుంటున్నారు. వివిధ శాఖ‌ల సిబ్బంది కూడ బారులు తీరి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం క‌నిపించింది.