రైతులకు చల్లని వార్త

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

రైతులకు చల్లని వార్త
– తీరాన్ని తాకిన నైరుతి
– ప్రకటించిన వాతావరణ శాఖ
దర్శిని డెస్క్‌: దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోని తీరాన్ని తాకినట్లు ప్రకటించారు. గురువారం ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను తీవ్రత మరింత పెరిగింది. ఇది జూన్‌ 5న ఏర్పడగా బుధవారానికల్లా తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు తెలిపారు. మరోవైపు బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని మొగలిద్దలో 6.9 సెంటీమీటర్లు, నల్గొండలోని నాంపల్లిలో 5.3, వికారాబాద్‌లోని బంట్వారంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో.. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage