‘భాష్యం’ విద్యార్థి.. భళా..!
– సీఎం కప్ పోటీలో పోటీలో గోల్డ్ మెడల్
– రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీకి ఎంపిక
– సాయి సుధీష్ణను సత్కరించిన కాలేజీ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థినిని సాయి సుధీష్ణను యజమాన్యం భళా అంటూ అంటూ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్-2024 జిల్లా స్థాయి పోటీలో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది. ఇందులో భాగంగా శనివారం కళాశాల యజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాలలో సాయి సుధీష్ణ ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. వికారాబాద్ లో నిర్వహించిన సీఎం కప్-2024లో జిల్లా స్థాయి 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు. పతకం సాధించింది. దీంతో సాయి సుధీష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల యజమాన్యం, కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ, అధ్యక్షురాలు అనురాధ రమేష్, ప్రిన్సిపల్ సోమనాథ్‌లు సాయి సుధీష్ఠను ఘనంగా సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బంగారు పతకం సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల సాయి సుధీష్ణను తాండూరు క్రీడా రత్నంగా అభివర్ణించారు. అదేవిధంగా సాయి సుధీష్ణ క్రికెట్ లో తాండూరు నుంచి బూస్ట్ స్కాలర్ షిప్ సాధించి క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రీ అకాడమిలో కోచింగ్ తీసుకుంటుందని, రంగారెడ్డి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫాస్ట్ బౌలర్ గా రాణించడం పట్ల శభాష్ అంటూ అభినందించారు. ఫాస్ట్ బౌలర్ గా రాణించి.. భారత జట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మహిపాల్ రెడ్డి, మల్లికార్జున్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

