పది మంది మందుబాబులకు జైలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పది మంది మందుబాబులకు జైలు..!
– మరో ఏడుగురికి జరిమాన
– ట్రాఫిక్ న్యూనెన్స్‌, లైసెన్స్‌లేని డ్రైవర్లకు కూడా
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ దొరికిపోయిన మందుబాబులకు జైలు, జరిమాన విధిస్తూ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉమా హారతి తీర్పు ఇచ్చినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో పది మందికి జైలుతో పాటు జరిమాన, మరో ఏడుగురికి జరిమాన విధించగా.. పట్టణంలో ట్రాఫిక్ న్యూసెన్స్ చేసిన వ్యాపారికి, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. గత నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బాల కిష్టయ్య(తాండూరు)కు మూడు రోజులు జైలు, వడ్డే మహేష్ (కోట బాస్ పల్లి) యాదగిరి(హన్మాపూర్)లకు రెండు రోజులు జైలు శిక్షతో పాటు జరిమాన ఒక్కొక్కరికి రూ. 1వెయ్యి జరిమాన విధించారని తెలిపారు.

అదేవిధంగా రత్నం(రేగుండి), పాండు గౌడ్(కల్లూరు), రియాజ్(తాండూరు), రాజు(కర్చికలన్), సంజీవరెడ్డి(తాండూరు), రామకృష్ణారెడ్డి(తాండూరు), నారాయణ(బెన్నూర్)లతో పాటు మరో ఏడుగురికి ఒక రోజు జైలతో పాటు రూ. 1వెయ్యి జరిమానా విధించారని తెలిపారు. దీంతో పాటు తాండూరు పట్టణంలో తోపుడు బండి ద్వారా ట్రాఫిక్ అంతరాయంకు కారణమైన మాక్సూద్(తాండూరు పట్టణం)కు రూ. 500ల జరిమాన, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ముగ్గురికి ఒక్కొక్కరికి 2500 జరిమానా విధించడం జరిగిందని వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ అంతరాయం కలిగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్