తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్
– ఈనెల 8 నుంచి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు
– ఎమ్మల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు
– ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల క్రీడాకారులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ కు సంబందించిన ప్రకటన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వెలువడింది. ఈనెల 8వ తేది నుంచి 11వ తేది వరకు తాండూరు పట్టణంలోని గౌతమీ మోడల్ స్కూల్ మైదానంలో తాండూరు నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖోతో పాటు ప్రత్యేకంగా బాలికలకు త్రో బాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ జెడ్పీ హెచ్ఎస్ స్కూల్, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు టోర్నమెంట్లో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఆయా స్కూళ్ల నుంచి క్రీడాకారులు పాల్గొనాలని, ఆసక్తిగల క్రీడాకారులు పీడీలు అనంతయ్య సెల్: 9701586893, గోపాల్ సెల్: 9951197417లకు సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి