అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు
– శుభాకాంక్ష‌లు తెలిపిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించిన నాయ‌కులు, వ్యాపారుల
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వీర‌శైవ స‌మాజం మాజీ అధ్య‌క్షులు, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ మాజీ అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు అట్టహాసంగా జ‌రిగాయి. ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధవారం తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్ స‌మీపంలో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు, ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసానికి వచ్చి శాలువాతో స‌త్క‌రించి.. పూల మాల‌ల‌తో స‌న్మానించారు. పటేల్ శ్రీశైలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

 

అనంత‌రం ప‌టేల్ శ్రీ‌శైలం చేత కేక్‌ను క‌ట్ చేయించారు. అదేవిధంగా వీర‌శైవ స‌మాజం, వీర‌శైవ యువ‌ద‌ళ్‌ స‌భ్యుల‌తో పాటు దిగ్రేన్ అండ్ సీడ్స్ మ‌ర్చంట్స్ ప్రతినిధులు, ప‌లువురు ప్రముఖులు, ప‌ట్ట‌ణ వ్యాపారులు, అభిమానులు త‌దిత‌రులు హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలిపి స‌న్మానించారు. మ‌రోవైపు కుమారులు భావిగి భద్రేశ్వర దేవాలయ చైర్మన్ ప‌టేల్ కిర‌ణ్ కుమార్, ప‌టేల్ శ్రావణ్, మ‌నుమండ్లు, మ‌నుమ‌రాండ్లు కూడ శుభాకాంక్ష‌లు తెలిపారు. పటేల్ శ్రీశైలం జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

ఇది కూడా చదవండి…

ప్రజా సేవలో ముందుకు సాగాలి