నక్షత్ర అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
– నృత్యకళాకారిణిని సన్మానించిన బీసీ సంఘం కన్వినర్ రాజకుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన నృత్యకళాకారిణి నక్షత్ర అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తాండూరుకు చెందిన కూచిపూడి వేణుగోపాల్, జయల కుమార్తె నక్షత్ర భరత నాట్యంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్లో వరల్డ్ రికార్డు నమోదు చేసి.. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రశంసలు పొందడం పట్ల ఆదివారం బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ. భరత నాట్యంలో నక్షత్ర సాధించిన ప్రతిభ తాండూరు విద్యార్థి లోకానికి ఆదర్శనీయమన్నారు. తాండూరు పేరు నిలబెట్టిన నక్షత్ర తల్లిదండ్రులు వేణుగో పాల్, జయలు ఎంతో అదృష్ట వంతులన్నారు. అదేవిధంగా ఈనెలలో తిరుపతిలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అభినయ ఆర్ట్స్ 21 వార్షిక పద్య నాటికలు, సాం ఘిక నాటిక, శాస్త్రీయ జానపద, సోలో ప్రదర్శనలో పాల్గొంటున్న నక్షత్ర రాణించాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ మకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు నాయికోటి జ్యోతి, గాజుల మాధవి, నాయకులు లక్ష్మణాచారి, రాధాకృష్ణ, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, సమీయోద్దీన్, బస్వరాజు, దత్తాత్రేయ, హరి ప్రసాద్, మతీన్, టైలర్ రమేష్, లక్ష్మణ్ గౌడ్, రజక నర్సింహా, పూజారి రాజు, దుబాయ్ వెంకటేష్, ఎన్. శ్రీను, శివ, ఇందూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
