కీరలో హెల్త్ పవర్స్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

కీరలో హెల్త్ పవర్స్..!
– ఇందులోని పోషకాలతో రోగాలు నయం
– గుండె రిస్క్‌ తగ్గించే అవకాశం
దర్శిని డెస్క్ : కీర దోష తినడం వల్ల శరీరానికి హెల్త్ ఫవర్స్‌ను సప్లయ్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న పోషకాల వల్ల పలు రకాల రోగాలను నయం చేసుకోవచ్చని అంటున్నారు. వేసవికాలంతోపాటు శీతాకాలంలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. చల్లని వాతావరణంలో కీరదోస తినడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కీరదోసకాయలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. కీరలోని పోషకాలు కణజాలాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు.. కీర దోస ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో కలిగే ప్రయోజనాలు.. ఇవే..
చలికాలంలో కీరదోసను రెగ్యులర్‌గా తింటే క్రమంగా బరువు తగ్గుతారు.. వాస్తవానికి చలి వల్ల చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు.. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఈ కాలంలో ఆయిల్ ఫుడ్ కు బదులు దోసకాయ తింటే.. క్యాలరీలు తీసుకోవడం తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ కీరదోసకాయలు సహాయపడుతాయి. కీరదోసకాయ మన కడుపులోని వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.. అలాగే కడుపును చల్లగా ఉంచేలా చేస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అలాగే, ఇందులో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.. ఇంకా ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. కీరదోసకాయలు మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అందుకే దీనిని అనేక ఫేస్ ప్యాక్‌లు, సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. కాబట్టి మనం దీనిని తింటే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించేందుకు, నివారించడానికి కీరదోసకాయలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరగాయలలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య ఉండదు. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇదికూడా చదవండి…

మహిళ కడుపులో 8 కిలోల గడ్డ..!