మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాటు
– గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
– మంత్రిని కలిసిన మార్కెట్ కమిటి పాలకవర్గం
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధికి కొత్త పాలకవర్గం తోడ్పాటు అందించాలని రాష్ట్ర సమాచార, గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ లో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి నూతన చైర్ పర్సన్ గద్దె వీణ శ్రీనివాస చారి, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, పాలకవర్గ సభ్యులు మంత్రి మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకవర్గం తరుపున మంత్రి మహేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో రైతులు, వ్యాపారులకు అందుబాటులో ఉండాలన్నారు. మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాడాలన్నారు. ఇందుకు తమవంతు సహకారం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, సిద్రాల శ్రీనివాస్, డైరెక్టర్లు హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, ప్రకాష్, కుర్వ భీమప్ప, గోపాల్ రెడ్డి, ఎండీ ముస్తఫా, గోవింద్ నాయక్, వెంకటప్ప, మంత్రి వెంకటయ్య, శ్రీనివాస్, భానుప్రసాద్, ప్రశాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు