కుర్రాడి ఓవర్ యాక్షన్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కుర్రాడి ఓవర్ యాక్షన్..!
– బస్సులను ఓవర్‌ చేయబోయి ఇరుక్కుపోయాడు
– రెండు బస్సుల మద్య పడి తల్లడిల్లిన వైనం
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ కుర్రాడు బైకును వేగంగా నడిపిస్తూ ఓవర్ యాక్షన్ చేయబోయాడు. బస్సులను ఓవర్ టేక్ చేయబోయి ఆ రెండు బస్సుల మద్య ఇరుక్కుని తల్లడిల్లిపోయాడు. ఈ సంఘటన తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అయ్యప్ప నగర్‌కు చెందిన అశోక్ అనే కుర్రాడు బైకుపై ఫ్లైఓవర్ బ్రిడ్జీ పైనుంచి తాండూరు పట్టనంలోకి వస్తున్నాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరో బస్సు రావడంతో బైకు అదుపుతప్పి రెండు బస్సుల మద్య ఇరుక్కు పోయాడు. రెండు బస్సుల మద్యం గాయాలతో తల్లడిల్లిపోయాడు. గమనించిన స్థానికులు కుర్రాడిని బయటకు తీసీ అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్ట వశాత్తు ప్రాణాపాయం జరగలేదు. కాగా కుర్రాడి కాలుకు, శరీర భాగాలకు గాయాలయ్యాయి.

ఇదికూడా చదవండి…

హామిలు అమలు కాని చేతగాని సర్కారు..!