వికారాబాద్‌ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వికారాబాద్‌ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..!
– సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
– త్వరగా పూర్తిచేయించేలా మనోహర్ రెడ్డి పోకస్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు – వికారాబాద్ – హైదరాబాద్‌ రోడ్డు ఇబ్బందుల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రోడ్డు పనులను చేపట్టేలా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ – తాండూరు రోడ్డు అధ్వాన్నంగా మారడంతో రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

పనులు వెంటనే చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయించేలా చూడాలని ఆర్అండ్‌బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషిపట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

రోడ్ల నిర్మాణంతో వార్డులకు మహర్ధశ..!