ఎంపీ రంజిత్‌రెడ్డిని సన్మానించిన టీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డిని తాండూరు టీఆర్ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. శనివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరుకు చెందిన టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు మసూద్ తదితరులు హైదరాబాద్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డికి జ్ఞాపికను అందజేసీ.. శాలువాతా సత్కరించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిని పదవులు అధిరోహించి తాండూరు అభివృద్ధికి సహాకారం అందించాలని ఆకాంక్షించారు.
