భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం
– నగరేశ్వర దేవాలయంలో అమ్మవారికి పూజలు
– పాల్గొన్న మహిళ సంఘం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత ఆత్మార్పణ దినోత్సవంను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహి వాంచిన వేడులకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళ భక్తులు అమ్మవారిని కొలుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ముందు దీపాలను వెలిగించి.. హోమం, హారతి సమర్పించారు. దీంతో నగరేశ్వర దేవాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొ ఉంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరీ అవతరణ, ఆత్మార్పరణ అంశాలను వివరించారు. ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారంగా వాసవీ మాతగా జన్మించారని, ధర్మాన్ని, స్త్రీల గౌరవాన్ని కాపాండేందుకు, వైశ్యుల ఔదర్యాన్ని చాటిచెప్పి చరిత్రాత్మకురాలుగా నిలిచారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం ఉపాధ్యక్షులు గుబ్బ ప్రగతి, కార్యదర్శి సింగంశెట్టి శోభతో పాలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

