గారడి గ్యారెంటీలు..!
– హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
– స్థానిక ఎన్నికల్లో హస్తంను బొంద పెట్టాలే
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో నేతల చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాలు అంటూ ప్రజలను గారడి చేసే పాలన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాండూరుకు వచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మల్లేష్, సాయిలు తదితరులుకు గులాబీ కండువా కప్పీ పార్టీలోకి ఆ హ్వానించారు.
అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో గారడి చేస్తోందని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని అన్నారు. దేవుడు లాంటి కేసీఆర్ ను వదులుకుని దున్నపోతుకు ఓట్లు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మాజీ సర్పంచు బసిరెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

