రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు సాయి మేధ విద్యాలయలో వసంత పంచమి
– సాముహిక అక్షరాభ్యాస వేడుకకు ముస్తాము
– చిన్నారులకు, తల్లిదండ్రులకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలోని శ్రీ సాయి మేధ విద్యాలయలో రేపు వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రతి యేడాది పాఠశాలలో వసంతి పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించే చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస వేడుకలకు పాఠశాల ముస్తాబయ్యింది. ఉదయం 8-24 గంటలకు స్కూల్ ఆవరణలో చిన్నారులకు చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం, పండితుల మంత్రోచ్చరణల మద్య అక్షరాభ్యాసం చేయించనున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించ తలచిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారుల అక్షరాభ్యాసం కోసం కొత్త పలక, బలపం, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, బియ్యం, కుడుక, వక్కలు, తమలపాకులు, టెంకాయ, పూలు పండ్లు తీసుకరావాలని సూచించారు. వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసంలో తల్లిదండ్రులు పాల్గొని సరస్వతి దేవి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.

ఇదికూడా చదవండి…

అదరగొట్టిన తాండూరు మహిళలు