మా వేతనాలు పెంచండి సారు..!
– మృతుల స్థానంలో నియమకాలు చేయండి
– మున్సిపల్ కమీషనర్‌కు యూనియన్ నాయకుల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వేతనాలు పెంచాలని తాండూరు మున్సిపల్ జవాన్లు కోరారు. మృతుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ లో పని చేస్తున్న జవాన్లకు వేతనాలు పెంచాలని ప్రభుత్వం జీఓ జారి చేసిందని గుర్తుచేశారు. ఈ మేరకు జవాన్లుగా పనిచేస్తున్న సీహెచ్ అశోక్, రమేష్, తిరుపతిరావు, భూపతి, గురుప్రసాద్, బాలు, ఎం.గోపాల్, శశికాంత్, శ్రీనివాస్, సుభాష్, వెంకటేష్, ఎస్. రవీ, వీరేశంలకు వేతనాలు పెంచాలని కోరారు.
దీంతో పాటు పలు కారణాల వల్ల మృతి చెందిన కార్మికులు మ్యాతరి మున్నెప్ప, దస్తమ్మ, ఎం.శ్రీనివాస్, కె.దస్తప్ప, అలంపల్లి అశోక్ కుమార్, పుష్పలతల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికీ విధులు నిర్వహిస్తూ వేతనాలు పొందని బి.జయప్రకాష్, డి. పద్మమ్మ, మంజుల, నర్సింలు, జ్యోతిలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, జవాన్లు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

