తాండూరు కాలేజీకి కొత్త అధ్యాపకులు
– విధుల్లో చేరిన ముగ్గురు జూనియర్ లెక్చరర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ముగ్గురు కొత్త అధ్యాపకులు నియామకం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జూనియర్ అధ్యాపకులకు ఉద్యోగాలు నియామకాలు అందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు జూనియర్ కాలేజీకి కొత్త జూనియర్ అధ్యాపకులు వచ్చినట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినా థప్ప తెలిపారు.

హిందీ లెక్చరర్ గా ప్రకాష్, జూయాలజీ(ఉర్దూ మీడియం) లెక్చరర్ గా సయ్యద్ సిరాజుద్దీన్, గణితం లెక్చరర్ గా డి. అరుణ్ కుమార్ లు గురువారం విధుల్లో చేరినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయంతో కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ కావడం జరిగిందని ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

