జిల్లాలో వాహనాల వేలం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలో వాహనాల వేలం..!
– పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– ప్రకటించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని పోలీస్టేషన్లలో వదిలేసిన వాహనాలను వేలం వేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వదిలివేయబడిన/గుర్తు తెలియని 148 వాహనాలను సేకరించారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో భద్రపరిచిన వాహనాలు పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగిందని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే, వారు జిల్లా ఎస్పీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ నుండి ఒక వారం లోపు వాహనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా చేయని పక్షంలో, ఈ వాహనాలను జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈనెల 26న బహిరంగ వేలం వేయడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు వాహనాల వేలం కమిటీ ఛైర్మన్, జిల్లా అదనపు ఎస్పీ టి.వి. హనుమంత్ రావు, సెల్ నంబర్ 8712670012 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వాహనాల వివరాలను జిల్లా పోలీస్ సోషల్(Facebook,X,Whatsapp) మీడియాలో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇదికూడా చదవండి…

పాలిటిక్స్ అండర్ ప్రెషర్…!