ప్రపంచ మనుగడలో విశ్వకర్మలు మార్గదర్శకులు
– యాలాలో ఘనంగా విశ్వకర్మ జయంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచ మనుగడకు విశ్వకర్మలు మార్గదర్శకులుగా నిలుస్తారని పలువురు నాయకులు అన్నారు. శనివారం యాలాల మండల కేంద్రంలో విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

జయంతి ఉత్సవాలలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, యాలాల సర్పంచ్ సిద్రాల సులోచన, మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, టీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మల్లా రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, మండల నాయకులు ఆకుల బసవరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, యాలల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గాజుల మన్నన్, తాండూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ ముదిరాజ్, యాలాల మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కమ్మరి శేఖర్ చారి, ప్రధాన కార్యదర్శి భాస్కర చారి, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి, విద్యావంతుల వేదిక నాయకులు బసవరాజ్ సార్, విశ్వకర్మ నాయకులు శ్రీనివాస్ చారి, బ్రహ్మయ్య చారి, బాలయ్య చారి, శేఖర్ చారి, చెన్నయ్య చారి, విశ్వకర్మ యువ నాయకులు విద్యసాగర్ చారి, చిరంజీవి చారి, రవీందర్ చారి, గంగాధర్ చారి, తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మలు లోకానికి ఆదర్శప్రాయులు అని అన్నారు. వారు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. అంతకుముందు జయంతి ఉత్సవాలలో జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మ ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు.


