పైలెట్ గెలుపుపై బీసీల గురి

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ గెలుపుపై బీసీల గురి
– యాలాల మండలంలో విస్తృత ప్రచారం
– ఎమ్మెల్యేకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి
– పాల్గొన్న బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకోసం బీసీ సంఘం నాయకులు గురిపెట్టారు. గత వారం, పది రోజులుగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళవారం యాలాల మండలంలోని బండమీదిపల్లి, తిమ్మాయిపల్లి, అగ్గనూర్, దౌలాపూర్, గిరిజాపూర్ తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నేతలు ఆయా గ్రామాల్లో గడపగడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం రూ.2 కోట్లతో 2ఎకరాలలో బీసీ సమీకృత భవన నిర్మాణానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డిని గెలిపిస్తే బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల్లో రోహిత్ రెడ్డి కోసం కారుగుర్తుకు ఓటేసి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, అగమార్ సర్పంచ్ భీమప్ప, తిమ్మాయిపల్లి కృష్ణ, వెంకటయ్య, చాకలి కృష్ణ, బీసీ సంఘం నాయకులు బస్వరాజు, రాము, వెంకటేష్, నవీన్, తమ్మప్ప, చంద్రశేఖర్. హరి, రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!