రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలి
– రూ. 25 కోట్లు కేటాయిస్తేనే సంక్షేమం సాధ్యం
– బీసీ కార్పోరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
– ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిఫ్లు రిలీజ్ చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సర్కారు బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు.

ఈనెల 19న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో బీసీలకు రూ. 25వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన 12 కార్పోరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. వాషర్ మెన్, ఉప్పర, కృష్ణ బలిజ, పూసల, కమ్మర, విశ్వబ్రాహ్మణులు, ముదిరాజ్, తాడి టాపర్స్, నాయి బ్రాహ్మణలు, వడ్డెర, బోయ వాల్మీకీ కోఆపరేటివ్ సోసైటీల ద్వారా నిధులు విడుదల చేసి పూర్తి అధికారాలను సోసైటీలకు ఇవ్వాలన్నారు. బీసీ కార్పోరేషన్ల ద్వారా బీసీ నిరుద్యోగ యువతీ, యువకులకు రుణాలు అందించేందుకు కూడా ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని అన్నారు.

అదేవిధంగా గత ఏడేళ్లుగా పెండింగులో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిఫ్లకు కూడా పూర్తి బడ్జెట్ కేటాయించి నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న 490 బీసీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.శాలలకు సొంత భవనాలు ఏర్పాటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నిరుద్యోగ యువతి యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

