మహిళల అభివృద్ధికి పెద్దపీట..!
– అన్ని రంగాల్లో ప్రంపచాన్ని జయించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మహిళ మెగా జాబ్ మేళాకు స్పందన
– 400లో 200 మందికి ఉద్యోగాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎన్సీ ఫాక్స్ కాన్ వారి సౌజన్యంతో మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు.

ఈ జాబ్ మేళాకు నియోజకవర్గంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 400ల మంది మహిళలు తరలివచ్చారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు అర్హతల మహిళలను ఇంటర్వూలు నిర్వహించారు. ఇందులో సుమారు 200ల మంది మహిళలను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ప్రపంచాన్ని జయించాలన్నారు.

మహిళలు ముందుకు సాగుతేనే ఇళ్లు బాగుపడుతుందన్నారు. జాబ్ మెళాలో ఉద్యోగాలకు ఎంపికైన మహిళలు బాధ్యతగా పనిచేసి సత్తా చాటాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. అమ్మ ఆదరణ కమిటిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో, ఆర్టీసీలో అద్దె బస్సులను అందించి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ఎంఎన్సీ ఫాక్ కాన్ కంపెనీ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

