హస్తంలోకి బల్దియా చైర్ పర్సన్..?
– చేరికకు ముహూర్తము ఖరారు
– మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా
– చర్చనీయాంశమైన రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హస్తం గూటికి చేరబోతున్నారు. ఈ ప్రచారం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజుల నుంచి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పుకార్లు వచ్చాయి. మొదటి నుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మద్య వర్గపోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలో ఉన్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మరికొందరు కౌన్సిలర్లు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించారు.
ఎన్నికల ముందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు కలిసిపోవడంతో అవిశ్వాస తీర్మానం విషయం అటకెక్కింది. ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు కొందరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా పాల్పంచుకోవడంతో అప్పట్లో చైర్ పర్సన్ కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది.
తాజాగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై సొంత పార్టీ కౌన్సిలర్లు మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెరపైకి రావడంతో కినుక వహించినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంపై మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఖచ్చితత్వంతో ఉన్నారని మాటలు వినిపిస్తన్నాయి. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భేటి అయి పార్టీ మారే విషయంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. రేపు రిపబ్లిక్ డే తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

