సైబర్ నేరాలు ఎంతో ప్రమాదకరం
– అప్రమత్తంతోనే ఉక్కుపాదం
– ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి
– డిజిటల్ బెదిరింపులపై 1930కు ఫిర్యాదు చేయాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
– తాండూరులో సైబర్ నేరాలపై అవగాహన, పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : దోపిడిలు, దొంగతనాల కన్నా సైబర్ నేరాలే అంత్యంత ప్రమాదకరమని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ నేరాలపై అప్రమత్తత పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. భారత దేశంలో రూ.30వేల కోట్ల సైబర్ నేరాలు జరిగాయని వెల్లడించారు. ప్రజల అమయాకత్వం, భయం, నిర్లక్ష్యం తదితర అంశాలను అసరాగా చేసుకుని సైబర్ మోసాలు చేస్తారని అన్నారు.

డిజిటల్ అరెస్టులు అంటూ ఎవ్వరు చేయరని, అలాటి కాల్స్ వస్తే ధైర్యంగా టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు అవగాహ న పెంచుకుంటేనే సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపవచ్చన్నారు. అంతకుముందు సైబర్ క్రైం డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి 26 రకాల సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నగేష్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డా. జయప్రసాద్, కార్యదర్శి అనిల్ కుమార్, డా.శివకుమార్, పోలీసు శాఖ సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

