ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు
– స్కూల్ ప్రిన్సిపల్, ఎస్ఎంసీపై చర్యలు తీసుకోండి
– రెవెన్యూ అధికారులు, ఎంఈఓకు కౌన్సిలర్ బొంబీనా ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని తాండూరు మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా ఆరోపించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని బొంబీనా డిమాండ్ చేశారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో పాటు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ లకు ఫిర్యాదు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ రిజ్వానా హుస్సేన్, ఎస్ఎంసీ చైర్మన్ జావిద్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా మన ఊరు, మన బడి పనులను ప్రారంభించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదులను అందజేశారు.