ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి
– దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి
– తాండూరులో క్రైస్తవుల నిరసన
– పడగాలకు కొవ్వొత్తులతో నివాళులు
తాండూరు, దర్శిన ప్రతినిధి : క్రైస్తవ ప్రభోదకులు ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని తాండూరు క్రైస్తవులు డిమాండ్ చేశారు. అనుమాస్పద మృతిలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం మార్వాడి బజార్ మెథడిస్ట్ చెర్చ్ ఫాస్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన ర్యాలీ చేపట్టారు.

చెర్చి నుంచి శాంత్ మహాల్ చౌరస్తా, ప్రభుత్వ కాలేజీ ముందు నుంచి కోర్టు రోడ్డు మార్గం మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా వరకు నినాదాలు చేసుకుంటూ వచ్చారు. చౌరస్తా వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల పలు ప్రార్ధన మందిరాల పాస్టర్లు, క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రా ల్లో క్రైస్తువులపై దాడులు చేయడం బాధాకరమన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దోషులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నజరేత చెర్చ్ పాస్టర్ అశోక్, వివిధ ప్రాంతాల క్రైస్తవ పెద్దలు, క్రైస్తవులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు