ప్ర‌స‌వాల‌లో ఆద్వితీయం..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ప్ర‌స‌వాల‌లో ఆద్వితీయం
– రాష్ట్రంలో రెండో స్థానంలో జిల్లా ఆసుప‌త్రి
– వ‌రుస‌గా కాన్పుల‌లో రికార్డు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులోని జిల్లా దవాఖాన ప్ర‌స‌వాల‌లో రికార్టు సృష్టించింది. వరుసగా రెండు నెలలు ప్రసవాల్లో రాష్ట్ర స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది. శ‌నివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. గ‌త‌ సెప్టెంబర్‌లో 686 ప్రసవాలు జరుగగా 374 సాధారణ, 312 సిజేరియన్ జ‌రిగాయ‌ని వివ‌రించారు. ఇక‌ అక్టోబర్‌ నెలలో 782 ప్రసవాలు జరుగగా 413 సాధారణ, 369 సిజేరియన్‌ జరిగాయ‌ని తెలిపారు. వ‌ర‌స‌ర‌గా రెండు నెల‌ల్లో అత్య‌ధిక ప్ర‌స‌వాలు జ‌ర‌గ‌డంతో తాండూరులోని జిల్లా
దవాఖాన రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆసుప‌త్రిలోని ప్ర‌సూతి విభాగం వైద్యులు, సిబ్బంది స‌హాకారంతో ఈఘ‌న‌త‌ను సాధించ‌డం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌ముందు కూడ అంద‌రి స‌హాకారంతో ఆసుప‌త్రిలో మెరుగైన వైద్య సేవ‌లందిస్తామ‌ని పేర్కొన్నారు.

15రోజుల్లో ఎంసీహెచ్ ఆసుప‌త్రి సేవ‌లు
మ‌రోవైపు తాండూరులో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన మాతా శిశు ఆసుప‌త్రి(ఎంసీహెచ్)లో వ‌చ్చే 15 రోజుల్లో వైద్య సేవ‌ల‌ను అందుబాటులోకి తీస‌క‌వ‌చ్చేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని సామాగ్రిని
త‌ర‌లించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఆసుప‌త్రిలోని ప్ర‌సూతి విభాగం, ఆప‌రేష‌న్ థియేట‌ర్, న‌వ‌జాత శిశు కేంద్రం, ఎన్ఆర్సీ విభాగాల‌తో పాటు మాత‌, శిశు ఓపీ వైద్య సేవ‌ల‌ను అక్క‌డికే త‌ర‌లిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసుప‌త్రి ఆర్ఎంఓ డాక్ట‌ర్ ఆనంద్ గోపాల్ రెడ్డి ఉన్నారు.