మార్కెట్ కమిటి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
మార్కెట్ కమిటి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం
– ఎమ్మెల్యేపై అనవసర విమర్శలు తగదు
– ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ హర్షణీయం
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి రిజర్వేషన్లపై ప్రజల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు మీడియాంతో మాట్లాడారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటి రిజర్వేషన్ల ప్రకారమే ప్రతిపాదనలు పంపారని అన్నారు. బీసీ జనరల్‌ కిందనే చైర్మన్ ప్రతిపాదనలు పంపారని అన్నారు. త్వరలో కూడా నూతన మార్కేట్ కమిటీ మర్కేటింగ్ శాఖ ఆమెదం తెలిపి రాతపూర్వకంగా జీవో కూడ త్వరలో విడుదల చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే పనితీరును ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే గారు రాజకీయంగా పూర్తి అనుభవంతో ఉన్నారని, అప్పటికప్పుడు ఎమ్మెల్యే కాలేదని అన్నారు.

గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే గా ఎదిగారని తెలిపారు. అనవసరంగా తప్పుడు ప్రచారలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకే దఫా లో రైతు రుణమాఫీ చేయబోతుండడం హర్షణీయమన్నారు. గతంలో కూడా ఒకే దఫా రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వతమేనని అన్నారు. రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, విజయదేవి, ప్రవీణ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, బాతుల నాగు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆ పదవులపై ఆశలేదు..!