ఆయుష్ ఆరోగ్య మందిరం సేవలు భేష్..!
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
– ఘనంగా ఆరోగ్య మందిర వార్షికోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరికి ఆరోగ్య సేవలు అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆయుష్ ఆరోగ్య మందిర సేవలు భేష్ అని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 25వ వార్డులోని బెగ్గర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఆరోగ్య మందిరం 7వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ హాజరై వైద్య సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. మందిరంలో సేవలు అందిస్తున్న వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్య మందిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భీంసింగ్, ఆయుష్ ఆరోగ్య మందిరం డాక్టర్ మాలశ్రీ చవాన్, ఆరోగ్య శాఖ సిబ్బంది రేణుక (ANM), పార్వతి (ANM), యానీ (ANM), ఆశా కార్యకర్తలు మల్లేశ్వరి, శ్రీదేవి, రాములమ్మ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

