రేపు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు..!
– ఐఎంఏ, యువజాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు
– సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా రేపు తాండూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షులు డా. జయప్రసాద్, యువ జాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణలు తెలిపారు.

తాండూరు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఐఎంఏ, యువజాగృతి సంయుక్త ఆధ్వర్యంలో రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఎస్వీఆర్ గార్డెన్‌లో సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సికింద్రాబాద్ యశోధ ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.సీఎన్ శ్రీకాంత్ హాజరవుతున్నారని చెప్పారు. ఈ సదస్సులో క్యాన్సర్ వ్యాధికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, నిర్మూళన వంటి తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పిస్తారని వివరించారు. కావున తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చి అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి….

