ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు
– పూజలు చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: జగజ్యోతి శ్రీ బసవేశ్వర జయంతి ఉత్సవాలు తాండూరులో వైభోగంగా జరిగాయి. మంగళవారం తాండూరు వీరశైవ సమాజం వీరశైవ యువదళ్ సమిష్టి ఆద్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి జయంతి వేడుకలను ప్రారంభించారు. బసవ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేర్వేరుగా ఉత్సవాలలో పాల్గొన్నారు.
పట్టణంలోని వీరశైవ కాంప్లెక్స్ పై ఉన్న శ్రీ బసవేశ్వర విగ్రహానికి పూల మాలలు వేసి పూజలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి వినాయక చౌక్, శాంతిమహాల్ దౌరస్తా మీదుగా భద్రేశ్వర దేవాలయానికి చేరకున్నారు. ఈ కార్యక్రమాల్లో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్,
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాస్ చారీ, భద్రేశ్వర ఆలయ రెనోవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, సభ్యులు గాజుల శాంతుకుమార్, పటేల్ విజయ్ కుమార్, పరమేశ్వర్, తంబాకు చంద్రశేఖర్, వీరశైవ యువదళ్ పటేల్ కిరణ్, పటేల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

