అట్టహాసంగా రాజుగౌడ్ జన్మదిన వేడుకలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా రాజుగౌడ్ జన్మదిన వేడుకలు
– 150 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం
– గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్‌ను సన్మానించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బుధవారం రాజుగౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డితో పాటు స్థానిక నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. రాజుగౌడ్‌ను సన్మానించి.. పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి రాజుగౌడ్ చేత స్వయంగా కేక్ కట్ చేయించారు. కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జన్మదినం సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అయ్యప్ప స్వాముల సేవలో తరించారు. తాండూరు పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విఠల్ రెడ్డితో కలిసి రాజుగౌడ్ అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. దాదాపు 150 మంది స్వాములకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు చైర్మన్ రాజుగౌడ్ను అయ్యప్ప స్వాములు, రాజకీయ, కుల సంఘాల నాయకులు శాలువా, పూలమాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, డాక్టర్ సంపత్ కుమార్, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ వై స్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, తాండూరు రూరల్ సీఐ రాంబాబు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.