నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– రైతులకు చెక్కులు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు(ఎంపీఐపీ) భూ రైతులకు అందిస్తున్న నష్టపరిహరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు.

ఈ పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చిన 33 మంది రైతులు వారికి చెందిన 89 ఎకరాల 19 గుంటల భూమిని అందించారు. వారికి ప్రభుత్వం నష్టపరి హారం కింద మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులకు చెక్కుల పంపిణీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ రైతులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు కోసం భూములు కోల్పోయిన హకీంపేట్ రైతులకు అందించిన పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి….

