అర్హులైన వారందరూ టీకా వేసుకునేలా చూడాలి
– తాండూరు మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కరోనా నియంత్రణ కోసం నిర్వహిస్తున్న ఇంటింటికి వ్యాక్సీనేషన్ స్పెషల్ డ్రైవ్‌లో అర్హులైన వారందరు టీకా వేసుకునేలా చూడాలని తాండూరు మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు అన్నారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ, సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ బుచ్చిబాబు మాట్లాడుతూ తాండూరులో కొంతమంది వ్యాక్సీనేషన్‌పై అపోహలు పెంచుకుని టీకా వేసుకోవడం లేదని, ఇంకొంతమంది అనారోగ్య కారణాలతో దూరంగా ఉంటున్నారని అన్నారు. దీంతో పట్టణంలో వ్యాక్సీనేషన్ ప్రక్రియ నత్తనడక సాగుతోందన్నారు. కావున ఆయా వార్డుల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సంఘాల ప్రతినిధులు అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సీనేషన్ వేసుకునేలా చూడాలని, వందశాతం వ్యాక్సీనేషన్ పూర్తిచేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ రాము, బీజేపీ నాయకులు శివకుమార్, రజనీకాంత్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
