తాండూరులో మరో సైబర్ మోసం..!
– మున్సిపల్ కమీషనర్ పేరుతో ఫేక్ కాల్
– నమ్మి మోసపోయిన వ్యాపారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సైబర్ మోసాలపై పలు శాఖల అధికారులు, ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ మోసాలు ఆగడం లేదు. తాజాగా తాండూరు పట్టణంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమీషనర్‌ను అంటూ ఓ వ్యక్తి వ్యాపారికి ఫేక్ కాల్ చేసి డబ్బులు దండుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలో గోపాల్ మెడికల్ వ్యాపారికి కాల్ చేశాడు. నేడు మున్సిపల్ కమీషనర్‌ను మాట్లాడుతున్నా.. మీ ట్రేడ్ లైసెన్స్ బిల్లు పెండింగ్‌లో ఉందని, వెంటనే సుమారు రూ. 4వేలు బిల్లు చెల్లించాలని సూచించాడు. వెంటనే వ్యాపారి ఏమి ఆలోచించకుండా ఫోన్ పే చేశాడు. కాసేపటి తరువాత ఆలోచించగా అది ఫేక్ కాల్ అని తేలింది. దీంతో సైబర్ నేరగాడు బురిడి కొట్టించాడని గుర్తించారు. ఈ విషయంపై మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి స్పందిస్తూ ఇలాంటి ఫేక్ కాల్‌లను నమ్మరాదని, మున్సిపల్ కార్యాలయంలో, అధికారులకు మాత్రమే చెల్లించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

