బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులు ఎన్నుకోవాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులు ఎన్నుకోవాలి
– చైతన్యలో ఎంసెట్, కేరీర్ గైడెన్స్‌పై కౌన్సిలింగ్
– అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని విద్యావేత్తలు సూచించారు. ఇంటర్ తరువాత ఏమిటి..?, ఎప్ సెట్ కౌన్సిలింగ్ పై శిక్షణ ఆదివారం హిందూధర్మిక పరిషత్, చైతన్య జూనియర్ కళాశాల తాండూర్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యావేత్త పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ… ఇంటర్ తరువాత ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి, గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సుల సమాచారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కో-కన్వీనర్ నరేందర్, సభ్యులు పటేల్ విజయ్ కుమార్, ఓం ప్రకాష్ సోమని, చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పెళ్లివారింటికి పోలీసుల షాక్..!