మా హోటల్ వద్ద డ్యూటీ చేయకండి..!
– పోలీసులతో దురుసుతనం, విధులను ఆంటకం
– సోషల్ మీడియాలో వైరల్ అయిన వాగ్వివాదం
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : మా హోటల్ వద్ద డ్యూటీలు చేయొద్దని వ్యాపారి, స్థానికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన తాండూర్ నియోజకవర్గ బషీరాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని టాకీతండా రైల్వే గేటు వద్ద హెడ్కానిస్టేబుళ్లు లోక్యానాయక్, నర్సిములు, కాని స్టేబుళ్లు జయరాం, సంతోష్ వాహనాల తనిఖీ చేస్తున్నారు. గేటు సమీపంలోనే అరుణ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు.

పోలీసుల చేస్తున్న వాహనాల తనిఖీల విధులతో తమ గిరాకీ దెబ్బతింటోందని పోలీసులతో వాదనకు దిగారు. అరుణ్‌తో పాటు అరవింద్, లఖాన్, అర్జున్ విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెద్దగా అరుస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంపై అరుణ్, అరవింద్, లఖాన్, అర్జున్‌లపై బీఎన్ఎస్ 132, ఐపీసీ 352 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు బషీరాబాద్ ఎస్సై తెలిపారు.

ఇదికూడా చదవండి…

