పెళ్లివారింటికి పోలీసుల షాక్..!
– నిబంధనలకు విరుద్దంగా డీజే వినియోగం
– ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెళ్లి వేడుకలు జరుపుకున్న పెళ్లివారింటికి తాండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. నిషేధంకు విరుద్ధంగా డీజే వినియోగించిన పట్ల ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శనివారం పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు.

తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కుర్వ ఎల్లప్ప ఇంట్లో పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన కుర్వ జగదీష్ ద్వారా డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ డీజేను యాలాల మండలం అక్కంపల్లికి చెందిన బుడగ జంగం ఆదర్శ్ ఆపరేట్గా పనిచేశారు. తాండూరు పట్టణంలో డీజే సిస్టం వినియోగంకు పోలీసులు విధించారు. అయినా కూడా శుక్రవారం రాత్రి పెళ్లి వేడుకలో నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వాడారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లి నిర్వహకులు కుర్వ ఎల్లప్ప, డీజే యజమాని కుర్వ జగదీష్, ఆపరేటర్ ఆదర్శ్ లపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో డీజే వాడకం నిషేధంలో ఉందని తెలిపారు. డీజే వాడకం వల్ల మనుషులకు గుండెపోటు, రక్తపోటు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

