సర్కారు బడులపై నమ్మకం పెంచాలి
– విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– టీచర్లకు శిక్షణ తరగతులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడులపై నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని జీజేసీలోని పాఠశాలలో తాండూరు మండలానికి సంబంధించి ఎస్జీటీ ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు, తల్లిదండ్రులలో నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కొత్త పద్దతుల్లో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధుల్లో బోధన చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ఉత్త ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

