ఫైర్ స్టేషన్ భవనానికి చొరవ చూపించండి
– ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఫైర్ ఆఫీసర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని అగ్నిమాపకశాఖ కార్యాలయం సొంత భవనానికి చొరవ చూపాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేదంర్‌రెడ్డిని తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున కోరారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో మహేందర్‌రెడ్డిని కలిని వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న భవనం పురాతనం కావడంతో పాటు ఇరుకుగా మారిందని తెలిపారు. దీంతో విధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. సొంత భవనం పూర్తయ్యేంతవరకు తాత్కాళిక భవనం అయిన కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలోనే అగ్నిమాపక శాఖ కేంద్రానికి స్థలం కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. తప్పకుండా భవనం నిర్మాణంకు కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
