కన్నుల పండుగలా కలశ ధారణ
– భద్రేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మార్మోగిన జయ జయ ద్వానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో రథోత్సవానికి కలశ ధారణ కన్నుల పండుగలా కొనసాగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. గర్భగుడిలోని భద్రేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం జరిగిన కలశ పూజలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేతలతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు కలశ ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. ఎమ్మెల్యే పూజ అనంతరం భక్తుల జయ జయ ద్వానాల మద్య కలశ ధారణ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, దేవాలయ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు, యువదళ్ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

