పోలీసు శాఖకు పెట్రోల్ పంపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసు శాఖకు పెట్రోల్ పంపు..!
– నాణ్యత ప్రమాణాలు, నిర్వహణపై పరిశీలన
– తాండూరులో తనిఖీ చేసిన వికారాబాద్‌ సిఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని కేంద్ర పోలీసు శాఖకు పెట్రోల్ పంపు మంజూరు చేయడం జరిగిందని ఆ శాఖ వికాబాద్‌ సీఐ అంజద్ పాష తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని జీకే పెట్రోల్ పంపును తనిఖీ చేశారు. ఇక్కడ పంపులో డీజిల్, పెట్రోల్ క్వాలీటీలను పరిశీలించారు.

రోజువారి నిర్వహణ ఎలా జరుగుతుందని, పెట్రోల్, డీజిల్ నిల్వల సామర్థ్యం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ అంజద్ పాష మాట్లాడుతూ వికారాబాద్‌ పోలీసు శాఖకు ప్రభుత్వం పెట్రోల్ పంపు మంజూరు చేసిందని తెలిపారు. పోలీస్ వెల్పేర్ సోసైటీ ద్వారా దీని నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలి, క్వాలిటీ, క్వాంటిటీ ఎలా గుర్తించాలి అనే పలు విషయాలను తెలుసుకునేందుకు తాండూరులోని జికే పెట్రోల్ పంపును పరిశీలించడం జరిగిందని వెల్లడించారు. అయితే ప్రభుత్వం పోలీసు శాఖకు పెట్రోల్ పంపు మంజూరు చేసింది కాని, స్థలాన్ని కేటాయించలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ద్వారా స్థలాన్ని గుర్తించి పెట్రోల్ పంపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని ఇతర పెట్రోల్ పంపులను కూడా పరిశీలిస్తాయని చెప్పారు. ఆయన వెంట సేల్స్ మేనేజర్, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బులేరో బండి భీభత్సం..!