రేవంత్ రెడ్డివి రేటు రాజకీయాలు..!
– తాండూరు టిక్కెట్ ఎంతకు అమ్మాడో చెప్పాలి
– కాంగ్రెస్ గ్యారెంటీలకు వ్యారేంటే లేదు
– బీఆర్ఎస్ సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రేటు రాజకీయాలు చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శనివారం తాండూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తనపై కబ్జాలకు పాల్పడినట్లు, 100 కోట్లకు అమ్ముడు పోయినట్లు చేసిన వాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. తాండూరులో తాను చేసిన అభివృద్ధిపై చౌరస్తాలో అయినా, గుడిలో.. మసీదులో అయినా, ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్ధమని అన్నారు.
తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని.. ఇప్పుడు నీతి మాటలు వల్లించడం విడ్డూరమన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. తాండూరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి టిక్కెట్టును కూడ ఏరి కోరి అమ్మారని, ఈ సీటును ఎంతకు అమ్ముకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ చేస్తున్న రేటు రాజకీయాలపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో రూ. 1.74 కోట్ల ఆస్తులు చూపిస్తే.. ఎంపీ ఎన్నికల్లో ఆ ఆస్తులు రూ.3.65 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి కోడంగల్ లో పోటీ చేస్తున్న. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై గెలవాలని సవాల్ చేశారు.
అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు వొట్టి భోగస్ పథకాలన్నారు. కర్ణాటకలో అమలు చేయకపోవడంతో తిరుగుబాటు ప్రారంభమయ్యిందన్నారు. కర్ణాటక గెలుపు పేరుతో తెలంగాణలో మోసం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణను అంధాకారంలోకి నేట్టేందుకు యత్నిస్తుందని అన్నారు. గ్యారెంటీ లేని వారెంటీ పథకాలను నమ్మొద్దన్నారు. తెలంగాణ సర్కారు రైతు బంధు కింద ఎకరాకు రూ. 8 వేలు అందిస్తుంటే కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా కింద యేడాదికి రూ.15 వేలు మాత్రమే అందిస్తామని ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను అందరు గమనించాలన్నారు.
వాళ్లు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేసి రాష్ట్రాన్ని అంధాకారంలోకి నెట్టే కుట్రలను చేస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆశలకు పోయిన సర్పంచులు తిరిగి వస్తామంటే పార్టీలోకి స్వాగతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు:
ఇది కూడా చదవండి…

