యాలకుల టీ.. బెటర్..!
– జోడించి తాగితే రోగాలు పరార్
– డయాబెటిస్ ముప్పు తగ్గించే శక్తి
– కాలేయం, మూత్ర పిండాల పనితీరు మెరుగు
– ఇంకా మరెన్నో ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : చాలా మందికి టీ తాగడం ప్రియమైన అలవాటు. నచ్చిన పని చేయాలన్నా.. చేస్తున్న పనిలో ఉత్సహాంగా ఉండాలన్నా ఒక్క టీ అయినా తాగుతుంటారు. ఈ మద్య కాలంలో టీ ఒక్కటే కాకుండా దానికి రకరాల సుగంద ద్రవ్యాలను జోడించి తయారు చేసుకుని తాగుతున్నారు. అయితే టీ కి యాలకులు జోడించి సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

టీలో యాలకులు జోడించడం వల్ల తక్షణ ప్రభావాల్లో రుచి ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇవి టీలో తీపి, పూల రుచిని నింపుతాయని, దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు వంటివి ఘాటును కలిగిస్తాయని పేర్కొన్నారు. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని, ఇవి రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీలో యాలకులను జోడించడం ద్వారా శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని, అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుందంటున్నారు.

కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాలకులు జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించడానికి కూడా సహాయపడతాయని, ఇవి భోజనం తర్వాత అసౌకర్యాన్ని తగ్గిస్తుందని వివరించారు. బరువు తగ్గాలని అనుకునే వారికి యాలకుల టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.
యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. యాలకులు కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు మద్దతు ఇచ్చే సమ్మేళనాలను కలిగి ఉంటాయని… క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలనునిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టీలో యాలకులను జోడించడం ద్వారా శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందంటున్నారు. యాలకుల టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. దీంతో ఆందోళన, ఒత్తిడి దూరమవుతుందని వివరించారు. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయని, హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా తాగడం మంచిదని వివరించారు.
దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చుని పేర్కొన్నారు. టీలో యాలకులు జోడించడం వల్ల మూసుకుపోయిన వాయుమార్గాలను క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు. టీలో యాలకులు వేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచి డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుందని చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇదికూడా చదవండి…

